![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -343 లో.. కృష్ణ మురారి కలిసి అసలు నేరస్తుడిని కనిపెట్టడానికి జైల్లో ఉన్న ప్రభాకర్ దగ్గరకు బయల్దేరి వెళ్తుంటారు.. దార్లో కృష్ణ సినిమాకి వెళదామా అని అనగానే.. మురారి బండి ఆపి ఇప్పుడు మనం ఉన్న సిచువేషన్ లో సినిమా అవసరమా అంటాడు.
అ తర్వాత మనకి ఎక్కువ రోజులు టైమ్ లేదు. శుక్రవారం లోపల నిజానిజాలు సాక్ష్యాలతో బయటపెట్టాలని మురారి అంటాడు. అప్పుడే అటుగా వెళ్తున్న ఐస్ క్రీమ్ ని చూసి కృష్ణ చిన్నపిల్లల కావాలి అంటూ మురారిని అడుగుతుంది. మురారి ఐస్ క్రీం కొనిస్తాడు.ఆ తర్వాత కృష్ణ, మురారి కలిసి ప్రభాకర్ ని కలవడానికి వెళ్తారు. మరొకవైపు ముకుంద తన అన్నయ్య దేవ్ ని కలవడానికి జైలుకి వస్తుంది.. ఆ తర్వాత ముకుంద తన అన్నయ్యకి.. కృష్ణ మురారీల గురించి చెప్తుంది. గతం గుర్తుకు వచ్చింది. ఒకవైపు ప్రభాకర్ ఏ తప్పు చేయలేదని మురారి, మరోవైపు ప్రభాకర్ తప్పు చేశాడని భవాని అత్తయ్య ఇద్దరు ఛాలెంజ్ చేసుకున్నరు. ఒకవేళ ప్రభాకర్ ఏ తప్పు చెయ్యలేదని మురారి నిరూపిస్తే మురారికి నాకు పెళ్లి జరగదని ముకుంద చెప్తుంది. నువ్వేం టెన్షన్ పడకు.. నేను రెండు రోజుల్లో బెయిల్ మీద బయటకు వస్తాను. నేను వచ్చాక ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా చేస్తానని దేవ్ అంటాడు. మరొకవైపు రేవతి , మధు ఇద్దరు శంకుతల దగ్గరికి వస్తారు. కృష్ణ , మురారి ఇద్దరు కలిసి బయటకు వెళ్లారని రేవతి హ్యాపీగా ఫీల్ అవుతుంది.
మరొకవైపు దేవ్ తో ముకుంద మాట్లాడి వస్తుంటే కృష్ణ, మురారీలు ప్రభాకర్ ని కలవడానికి వస్తారు. వాళ్ళని చూసినాముకుంద తనని చూస్తారేమోనని టెన్షన్ పడుతు వాళ్ళు చూడకుండా పక్కకి వెళ్తుంది. మరొక వైపు కృష్ణ, మురారి ఇద్దరు ప్రభాకర్ తో మాట్లాడుతారు. వాళ్ళని అలా చూసి ప్రభాకర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మిమ్మల్ని తప్పకుండా బయటకు తీసుకొని వస్తానని ప్రభాకర్ కి మురారి చెప్తాడు. మరొకవైపు టెన్షన్ పడకని ముకుందకి దేవ్ చెప్పిన ముకుంద టెన్షన్ పడుతూనే ఉంటుంది. తరువాయి భాగంలో.. కృష్ణ, మురారి ఇద్దరు కలిసి భవాని దగ్గరికి వచ్చి.. పరిమళ మేడమ్ ని కలిసి వివరాలు అడిగాం. నాకు సర్జరీ చేయించిన అతని పేరు తను చెప్పిందని మురారి అంటాడు. అది విన్న ముకుంద టెన్షన్ పడుతుంది. దాంతో కృష్ణ గమనించి ముకుంద ఎందుకు టెన్షన్ పడుతుందని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |